కోయిల్‌సాగర్‌లో 19 అడుగులు నీటిమట్టం | - | Sakshi
Sakshi News home page

కోయిల్‌సాగర్‌లో 19 అడుగులు నీటిమట్టం

Aug 31 2026 1:08 AM | Updated on Aug 31 2026 1:08 AM

దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రం వరకు నీటిమట్టం 19 అడగులకు చేరుకుంది. జూరాల నుంచి రెండు పంపులను రన్‌ చేసి కోయిల్‌సాగర్‌కు నీటిని పంపింగ్‌ చేస్తుండగా.. మరోపక్క ఈ నెల 19 నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. వారం రోజులపాటు నీటిని విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినా.. జూరాల నుంచి నీటి విడుదల కొనసాగిస్తుండడంతో పంటలకు అలాగే వదులుతున్నారు. ప్రాజెక్టులోకి వస్తున్న నీటికి కొంత తక్కువగా కాల్వల ద్వారా వదులుతుండటంతో కోయిల్‌సాగర్‌లో నీటిమట్టం నిదానంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా మరో 13.6 అడుగుల మేర వస్తే పూర్తిస్థాయికి చేరుకుంటుంది.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: గ్రూప్‌–1, 2 ,3, 4 పరీక్షలకు సిద్ధమయ్యే మైనార్టీ వర్గాలకు చెందిన డిగ్రీ పాసైన యువతకు జనరల్‌ స్టడీస్‌లో ఉచిత ఫౌండేషన్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి విష్ణునందన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీపీఎల్‌ కేటగిరీ కింద అర్హులైన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు మంగళవారం నుంచి 14 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్‌, ఇందిర ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రాంగణం, ఎంఏఎం క్యాంపస్‌, ఇంటర్మీడియట్‌ బోర్డు వెనుక, శ్రీబాలాజీ ఎన్‌క్లేవ్‌, నాంపల్లి, హైదరాబాద్‌ అనే చిరునామాకు పంపుకోవాలన్నారు. ఎంపికై న వంద మందికి అక్కడే సెప్టెంబర్‌ 15 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.

ప్రశాంతంగా

నీట్‌–పీజీ పరీక్ష

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాలో ఆదివారం నీట్‌– పీజీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయ, జేపీఎన్‌సీ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ పర్యవేక్షించారు. ఫాతిమా విద్యాలయం, జేపీఎన్‌సీ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన భద్రతా ఏర్పాట్లు, వసతులు, పరీక్ష సరళిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేలా రైల్వేస్టేషన్‌, బస్టాండ్ల వద్ద బైక్‌ హెల్ప్‌సెంటర్లు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులను బైక్‌ హెల్ప్‌సెంటర్ల ద్వారా కేంద్రాలకు చేర్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ నవీన్‌, డీఎస్పీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement