వర్షాభావానికి ప్రత్యామ్నాయం.. | - | Sakshi
Sakshi News home page

వర్షాభావానికి ప్రత్యామ్నాయం..

Aug 31 2026 1:08 AM | Updated on Aug 31 2026 1:08 AM

వర్షాభావానికి ప్రత్యామ్నాయం.. అధికారుల సూచనలతో..

ఎన్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు పంటల ఎంపికలో మార్పులు చేసుకోవాలి. తక్కువ నీటితో సాగయ్యే ఉద్యాన పంటలు, కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి. బిందు సేద్యం, మల్చింగ్‌ వంటి నీటి పొదుపు పద్ధతులు పాటిస్తే వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవచ్చు.

– వేణుగోపాల్‌, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి

నీటి లభ్యత రోజురోజుకూ తగ్గుతుండటంతో వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే వంకాయ, బొప్పాయి పంటలను ఎంచుకున్నాను. ఉద్యాన శాఖ అధికారుల సూచనతో గ్రాఫ్టెడ్‌ మొక్కలతో వంకాయ సాగు చేపట్టాను. ఇతర రైతులు కూడా పరిస్థితులకు అనుగుణంగా పంట మార్పిడి చేసుకుని ఉద్యాన పంటల వైపు మళ్లితే నీటిని ఆదా చేయడంతోపాటు నిరంతర ఆదాయం పొందవచ్చు.

– అశోక్‌, రైతు, పెద్దఆదిర్యాల గ్రామం, జడ్చర్ల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement