● బాల్య స్నేహితులకు రోడ్డు ప్రమాదం
● ఒకరు దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం
భూత్పూర్/జడ్చర్ల: మామకు డబ్బులు ఇవ్వడానికి బైక్‌పై వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనకనుంచి బలంగా ఢీకొట్టి అల్లుడు మృతిచెందిన ఘటన భూత్పూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగన్న కథనం ప్రకారం.. జడ్చర్లలోని బాలాజీనగర్‌కు చెందిన బారాత్ జానీ(35), కావేరమ్మ పేట కు చెందిన మిత్రుడు సత్యంగౌడ్ ఇద్దరు కలిసి గద్వాలలోని జానీ మామకు డబ్బులు ఇవ్వడానికి బైక్‌పై వెళ్తుండగా.. భూత్పూర్ వద్ద జాతీయ రహ దారి బ్రిడ్జిపై ముందు వెళ్తున్న లారీ సడన్‌గా బ్రేక్‌వేయడంతో వెనకనుంచి బైక్‌తో బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో జానీ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. సంత్యంగౌడ్‌కు తీవ్ర గాయాలు కాగా.. జిల్లా ఆస్పత్రికి తరలించారు. జానీ భార్య భవానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
కావేరమ్మపేటలో విశాదం
జానీ, సత్యం బాల్య స్నేహితులు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాలను వెళ్లదిస్తున్నవారే.. గురువారం కావేరమ్మపేటలోని తమ ఇళ్ల నుంచి ఒకే బైక్‌పై బయటకు వెళ్లి భూత్పూర్ వద్ద ఫ్‌లై చో టుచేసుకున్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం విశయం తెలిసిన వెంటనే ఒక్కసారిగా కావేరమ్మపేటలో విశాదఛాయలు అ లుముకున్నాయి. మృతుడు జానీకి భార్య భవానీ, పిల్లలు సాయిచరణ్, హర్షవర్ధన్, ప్రణవి ఉన్నారు. సత్యంగౌడ్‌కు భార్య స్వాతి, ముగ్గురు పిల్లలున్నారు.


