క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం

Aug 26 2026 1:12 AM | Updated on Aug 26 2026 1:12 AM

పీయూలో జాతీయ క్రీడా దినోత్సవం

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: వీసీ శ్రీనివాస్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రతిభ కనబరచడంతో మానసిక, శారీరక దృఢత్వం సాధ్యమవుతుందన్నారు.

● బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలోనూ వీసీ పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు లోనుకాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. భవిష్యత్తుపై లక్ష్యంతో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.

● అనంతరం పీజీ బాలుర హాస్టల్‌ను వీసీ తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించాలని, హాస్టల్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వార్డెన్లు, కేర్‌టేకర్లను ఆదేశించారు. కార్యక్రమాల్లో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, పీడీ శ్రీనివాస్‌, శారద, మన్యం, నూర్జహాన్‌, రాజ్‌కుమార్‌, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement