పాలమూరు: జిల్లా కోర్టులో సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అన్ని రకాల కేసులు అధికంగా రాజీ అయ్యే విధంగా పోలీస్‌శాఖ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు దృష్టిసారించాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సూచించారు. జిల్లా కోర్టులో శుక్రవారం అన్ని రకాల ఇన్సూరెన్స్ మేనేజర్లు, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రాజీ అయ్యే క్రిమినల్, ఎంవీఐ యాక్ట్, డీడీ, చెక్ బౌన్స్ కేసులు ఇలా ప్రతి కేసును రాజీ చేసుకోవాలన్నారు. ఆయా శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను గుర్తించి కక్షిదారులకు నోటీసులు జారీ చేసి తప్పకుండా లోక్ అదాలత్‌కు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఈసారి నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో మోటార్ వాహన పెండింగ్ కేసులు అధికంగా పరిష్కారం జరిగే వి ధంగా చూడాలన్నారు. అదేవిధంగా కక్షిదారులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు రాజీ కావడానికి ఇరు వర్గాలు కోర్టు రావాలన్నారు. లోక్ అదాలత్‌లో ఒక్కసారి రాజీ అయి తే శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొన్నారు.
కుట్టుమిషన్లకు
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం కింద కుట్టుమిషన్ల పంపిణీకి బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి విష్ణునందన్ సూచించారు. ఆసక్తిగల మహిళ లు వచ్చే నెల 13 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మహిళల ఆర్థిక సాధి కారతకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సందేహాలుంటే బీసీ సంక్షేమశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
జూరాలకు 70 వేల
క్యూసెక్కుల వరద
గద్వాల/ఆత్మకూర్: జూరాలకు ఎగువ నుంచి శుక్రవారం 70,495 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు నీటిమట్టం 318.06 మీటర్లు, నిల్వ 8.73 టీఎంసీలుగా ఉంది. హైడల్ కేంద్రానికి 42,401 క్యూసెక్కులు సహా వివిధ కాల్వలకు మొత్తం 76,803 క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ విద్యు త్ కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టారు. ఇప్పటివరకు 139.917 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు.


