మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర అన్నారు. హనుమకొండలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 ఏళ్లలోపు రాష్ట్రస్థా యి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు. శరత్‌చంద్ర జెండాఊపి ఎంపికలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. అండర్–14 విభాగం వారికి ట్రయథ్లాన్ (ఏ గ్రూప్‌లో 60 మీ, లాంగ్‌జంప్, హైజంప్, బీ గ్రూప్‌లో 60 మీ, లాంగ్‌జంప్, షాట్‌ఫుట్, సీగ్రూప్‌లో 60మీ, లాంగ్‌జంప్, 600 మీటర్ల పరుగు) అండర్–16 విభాగం వారికి 60మీ, 600మీ, షాట్‌పుట్, లాంగ్‌జంప్, డిస్కస్‌త్రో, జావెలిన్, అండర్–18 వారికి 100మీ, 200మీ, 800మీ, 1500మీ, 3000మీ, 5000మీటర్ల, లాంగ్‌జప్, షాట్‌ఫుట్, జావెలిన్, డిస్కస్‌త్రో, అండర్–20 విభాగం వారికి 100మీ 200మీ, 800మీ, 1500మీ, 3000మీ, 5000మీటర్ల, లాంగ్‌జంప్, షాట్‌పుట్, జావెలిన్, డిస్కస్‌త్రో అంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికై న తుది జట్టును త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోచ్‌లు ఆనంద్‌కుమార్, సునీల్‌కుమార్, శ్రీనివాస్, పీడీలు శ్రీనివాసులు, రాజు, పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.


