గట్టు : మండల పరిధిలోని మాచర్ల అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం నాగుపాము కలకలం రేపింది. ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో మధ్యాహ్నం చిన్నారులు బయటకు వెళ్లిన సమయంలో కోడిగుడ్లు నిల్వ ఉంచిన చోట శుభ్రం చేస్తుండగా ఆయా నర్సమ్మకు నాగుపాము కన్పించింది. ఈ క్రమంలో ఆమె భయాందోళనకు గురైంది. అనంతరం సిబ్బంది ఆరగిద్దకు చెందిన స్నేక్ క్యాచర్ మహబూబ్‌కు సమాచారం ఇవ్వగా నాగుపామును చాకచక్యంగా పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు.
క్వార్టర్స్‌లో..
వనపర్తి టౌన్: సమీకృత కలెక్టరేట్ వెనకాల ఉన్న క్వార్టర్స్‌లో బుధవారం పాము కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ అధికారి, సాగర్ స్నేక్ సొసైటీ అఽ ద్యక్షుడు చీర్ల కృష్ణసాగర్ అక్కడికి చేరుకొని రిఫ్రిజిరేట ర్ కింద ఉన్న పామును పట్టుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణసాగర్ మాట్లాడుతూ.. పాము జర్రిపోతు జా తికి చెందిందని, సుమారు 8 అడుగులు పొడుగు ఉందన్నారు. అనంతరం సమీప అటవీ ప్రాంతంలో పా మును సరక్షితంగా వదిలేశామన్నారు. కార్యక్రమంలో స్నేక్ సొసైటీ సభ్యుడు కుమార్, నాసిర్ పాల్గొన్నారు.


