గంజాయి బాధితులకు చికిత్స కోసం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ ప్రారంభించారు. ఇందులో 30 మంది గంజాయి పాజిటివ్ బాధితులకు కౌన్సెలింగ్ నిర్వహణ కొసాగుతుంది. వీరిలో 20 మందిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందించారు. పాజిటివ్ వచ్చిన వారికి ఆరు వారాలపాటు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత 7 నుంచి 8 వారాల తర్వాత మరోసారి పరీక్ష చేసి నెగెటివ్ రిపోర్ట్ ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇలా ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి 7 మందికి నాన్ గంజాయి అడిక్టర్స్ సర్టిఫికెట్స్ ఇచ్చారు.


