‘సర్‌’పై తదుపరి యాక్షన్‌ ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’పై తదుపరి యాక్షన్‌ ప్లాన్‌

Aug 20 2026 3:46 AM | Updated on Aug 20 2026 3:46 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): సర్‌– 2026లో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై నోటీసుల జారీ, తదుపరి చర్యలకు సంబంధించి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి వీసీ నిర్వహించారు. వీసీ అనంతరం కలెక్టర్‌ ఆగస్టు 17, 2026 నాటికి మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను అధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వివరిస్తూ జిల్లాలో ఎస్‌ఐఆర్‌–2026 కింద రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో 2,13,588 మంది, జడ్చర్లలో 1,99,354 మంది, దేవరకద్రలో 2,16,460 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం సాధారణ ఓటర్లలో 3,13,256 మంది పురుషులు, 3,16,107 మంది మహిళలు, 19 మంది ఇతరులు ఉండగా.. అదనంగా 20 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు నమోదయ్యారని చెప్పారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 40,116 మంది ఓటర్ల నో మ్యాపింగ్‌ ఉండగా, 1,96,576 లాజికల్‌ డిస్క్రెపెన్సీలు గుర్తించారని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మ్యాపింగ్‌, లాజికల్‌ డిస్క్రెపెన్సీలు, బీఎల్‌ఓల అప్‌డేషన్స్‌, సమావేశాల మినిట్స్‌ను త్వరితగతిన పూర్తి చేసి, తుది ఓటర్ల జాబితా ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్‌, హరిప్రియ, ఆర్డీఓ నవీన్‌, ఎలక్షన్‌ అధికారి జాఫర్‌, అర్బన్‌ తహసీల్దార్‌ ఘన్సీరాం తదితరులు పాల్గొన్నారు.

టెండర్లు రద్దు

చేయాలని వినతి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లోని కురుమూర్తిస్వామి ఆలయంలో లడ్డూ, పులిహోర, పూజా సామగ్రి, టెంకాయల టెండర్లు రద్దు చేయాలని కోరు తూ వీహెచ్‌పీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని దేవాదాయఽ ధర్మాదాయశాఖ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. టెంకాయలు, లడ్డూ, పులిహోర విక్రయాలను దేవస్థానం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని కో రారు. భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, అన్ని వస్తువుల నిర్ణీత ధరల పట్టిక బహిరంగ బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రసాదాల నాణ్యత, పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలని వినతిలో కోరారు. గతంలో మాదిరిగా చిరు వ్యాపారులు అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలని విన్నవించారు. వినతిపత్రం అందజేసిన వారిలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు యాదిరెడ్డి, నాయకులు జనార్దన్‌, విఘ్నేష్‌, సుదర్శన్‌, విశ్వేశ్వర్‌ తదితరులున్నారు.

ఆర్టీసీ అభివృద్ధిలో

కార్మికుల పాత్ర కీలకం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద టీఎన్‌జీఓల భవనంలో నిర్వహించిన ఎన్‌ఎంయూ మహబూబ్‌నగర్‌ డిపో సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల తలరాత రాసే పూర్తిస్థాయి ఉద్యోగ భద్రతతో కూడిన విలీన ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నప్పుడే తాము అనుకున్నవి సాధించుకోగలుగుతామన్నారు. వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ సంఘాన్ని గెలుపు తీరాలకు చేర్చాల్సిన బాధ్యత కార్మికులందరిపై ఉందన్నారు. అంతకు ముందు డిపో కమిటీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌, కార్యదర్శిగా భానుప్రకాష్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, మధుసూదన్‌, శ్రీనివాసులు, నాయకులు చంద్రయ్య, జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement