ఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లి లక్ష్మీనరసింహ్మస్వామి ఆలయానికి సమీపంలోని నల్లకుంటలో ఉన్న వెంకయ్య బండవద్ద ఇటీవల గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన విషయం విదితమే. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం పలువురిపై కేసు నమోదు చేశారు. మామిళ్లపల్లికి చెందిన పంబలి రామస్వామి, దుడ్డు భీముడు, జరుపటి రాజు, గద్దె సైదులు, రాయిచేడ్‌కు చెందిన విష్ణు, దాసర్లపల్లికి చెందిన గంగుల విజేందర్‌రెడ్డి, వంగూరుకు చెందిన నామని శంకర్, కోనాపూర్‌కు చెందిన వెంకటస్వామి, బల్మూర్ మండలం జిన్‌కుంటకు ఎల్లికంటి మల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేష్ తెలిపా రు. గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరపడం చట్టవిరుద్ధమని అటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తవ్వకాల కోసం వినియోగించిన జేసీబీ, ఆటోను పోలీస్‌స్టేషన్‌కు తరంచినట్లు పేర్కొన్నారు.
రైలు నుంచి జారిపడి దినసరి కూలీ మృతి
దేవరకద్ర రూరల్: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి దినసరి కూలీ మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్‌ఐ రాజు కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగూడకు చెందిన మహేష్ (27) కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్లేందుకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. పేరూర్, కురుమూర్తి రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి కిందపడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
జైపాల్‌రెడ్డి
స్మారక అవార్డుల ప్రదానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జేపీఎన్‌సీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి స్మారకస్ఫూర్తి పురస్కారాన్ని పాలమూరు బిడ్డలు ఆలూరి గంగయ్య, సూర్యనారాయణకు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా కళాశాల చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డి స్మారకార్థం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అవార్డులను ప్రదానం చేస్తున్నామని, ఈ ఏడాది విద్యారంగంలో విశేష సేవలు అందించిన ఇద్దరికి అందించామని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డి దేశం గర్వించదగ్గ నాయకుడని, అంగవైకల్యం అధిగమించి అచెంలంచెలుగా ఎదిగి గొప్ప నాయకుడయ్యారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాధనలో ఆయన కీలకంగా వ్యవహరించారని, ఆయన నేటితరానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మిథున్‌రెడ్డి, భాస్కర్, కార్యదర్శి వెంకటరామారావు, కృష్ణమూర్తి, చంద్రశేఖర్, నాగేందర్, జగపతిరావు పాల్గొన్నారు.
శెభాష్ పోలీస్..
● సాంకేతిక పరిజ్ఞానంతో ఒకరి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు
రాజాపూర్: కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలను రాజాపూర్ పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. రాజాపూర్‌కు చెందిన టంకర రాజేశ్ సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి సమయంలో అతడు తన భార్యకు ఫోన్‌చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. తన ఇద్దరు పిల్లలతో కలిసి వెతుకుతుండగా, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణగౌడ్, హోంగార్డు ఖలీముద్దీన్, పెట్రోలింగ్ వాహన డ్రైవర్ నరేందర్ ఆరా తీశారు. వెంటనే ఎస్‌ఐ రాజశేఖర్‌కు సమాచా రం అందించడంతో అప్రమత్తమయ్యారు. ఫోన్ నంబర్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో రాజేశ్ మోత్కులకుంట శివారులో ని రైలు పట్టాలపై ఉన్నట్లు గుర్తించారు. పోలీసు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని రాజేశ్‌ను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన రాజాపూర్ పోలీసులను ఎస్పీ జానకి ప్రత్యేకంగా అభినందించారు.


