దత్తక్షేత్ర అభివృద్ధికి కృషి చేస్తా | - | Sakshi
Sakshi News home page

దత్తక్షేత్ర అభివృద్ధికి కృషి చేస్తా

Jul 29 2026 1:34 AM | Updated on Jul 29 2026 1:34 AM

మక్తల్‌: కృష్ణానది సమీపంలో ఉన్న దత్తక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్థఽక, మత్స్యసహకార, పాడిపరిశ్రమ, క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్‌ మండలం పస్పుల గ్రామంలోని దత్తక్షేత్రంలో మౌలిక వసతుల కోసం రూ.50 లక్షలతో అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దత్తక్షేత్రం ఉండటం వలన ఈ ప్రాంత భక్తులు ఎంతో అదృష్టవంతులన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విశ్రాంతి గదులు, బాత్రూంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం చిట్యాల– గజరందొడ్డి బ్రిడ్జి పనులను మంత్రి పరీశిలించారు. అంతకు ముందు మంత్రిని ఆలయ కమిటీ శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ దత్తప్ప, సర్పంచ్‌ మహేశ్వరి, ఆర్‌ఐ రాజు, తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, చిట్యాల సర్నంచ్‌ రహిమత్‌పాష తదితరులు పాల్గొన్నారు.

నిలువురాళ్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం

కృష్ణా: చారిత్రాత్మక ముడుమాల్‌ నిలువురాళ్ల ప్రాంతాన్ని అన్ని రకాలుగా తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రూ. 30 లక్షలతో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నిలువురాళ్ల చరిత్రను ప్రపంచం గుర్తించే విధంగా పురావస్తు శాఖ, డెక్కన్‌ హెరిటేజ్‌ సంస్థ కృషి చేస్తుందన్నారు. నిలువురాళ్ల గుండా వెళ్లిన విద్యుత్‌లైన్లను త్వరలోనే తొలగించే విధంగా చర్య లు తీసుకుంటానన్నారు. యునెస్కో గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందన్నారు. అనంతరం డెక్కన్‌ హెరిటేజ్‌ సంస్థ వేదకుమార్‌ మాట్లాడుతూ..భవిష్యత్‌ తరాలకు నిలువురాళ్ల చరిత్రను అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు బాల్‌రా జ్‌, నర్సప్ప, నాయకులు విజప్పగౌడ్‌, ఆనంద్‌గౌడ్‌, నాగలక్ష్మి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement