ఎల్‌నినో పడగ | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో పడగ

Jul 29 2026 1:34 AM | Updated on Jul 29 2026 1:34 AM

పశుగ్రాసంపైనా దృష్టి

శాస్త్రవేత్త డాక్టర్‌ కల్యాణి

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): పసిఫిక్‌ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఎల్‌నినో ప్రభావం ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌పై తీవ్రంగా ఉంటుంది. దీని ప్రభావంతో సాధారణ వర్షపాతం తగ్గడం, వర్షాల పంపిణీలో అసమానతలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు పనులు చేపట్టాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్‌ కల్యాణి సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటల ఎంపిక నుంచి నీటి నిర్వహణ వరకు శాసీ్త్రయ విధానాలను అనుసరిస్తే నష్టాలను గమనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన అవగాహన పత్రంలో ఎన్‌నినో ప్రభావ సమయంలో రైతులు అనుసరించాల్సిన పలు సూచనలను వివరించారు. వర్షాలు ఆలస్యమైనా ఆందోళన చెందకుండా పరిస్థితులకు అనుగుణంగా సాగు ప్రణాళిక మార్చుకోవాలని పేర్కొన్నారు.

వాతావరణ సమాచారమే కీలకం

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసే వాతావరణ సూచనలను రైతులు నిరంతరం పరిశీలించాలి. వర్షాల పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే విత్తనాలు వేయడం, తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి.

తక్కువ వ్యవధి పంటలు..

వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటే తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే, కరవును తట్టుకు నే పంట రకాలను ఎంపిక చేసుకోవాలి. అవసరౖ మెతే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి.

తేమ సంరక్షణ తప్పనిసరి

నేలలో తేమ నిల్వ ఉండేలా దుక్కి, మల్చింగ్‌, గట్లు ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలి. వర్షపు నీరు వృథా కాకుండా పొలాల్లోనే నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలి.

నీటిని పొదుపు..

డ్రిప్‌, స్ప్రింక్లర్‌ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను ఉపయోగించడం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు సాధ్యమవుతుంది. అందుబాటులో ఉన్న నీటి వనరులను అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలి.

సూచనల మేరకే..

కలుపు నియంత్రణ, అంతర పంటలు, పంట మార్పిడి వంటి శాసీ్త్రయ పద్ధతులను అనుసరించడం ద్వారా దిగుబడి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఎరువులు, పురుగు మందులు వ్యవసాయ శాఖ సూచనల మేరకే వినియోగించాలి.

వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు మేత కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముందుగానే పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్‌నినో ప్రభావం ఉందని భయపడాల్సిన అవసరం లేదు. వాతావరణ సూచనలకు అనుగుణంగా సాగు ప్రణాళిక రూపొందించుకుంటే పంట నష్టాలను తగ్గించుకోవచ్చు. శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులు, నీటి పొదుపు, సరైన పంటల ఎంపికతో రైతులు ఈ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోగలరు.

పాడి–పంట

ముందస్తు ప్రణాళికతో పంట నష్టాలకు అడ్డుకట్ట

వాతావరణ సూచనల ఆధారంగా సాగు చేపట్టాలి

తక్కువ వ్యవధి, కరవును తట్టుకునే

పంటలకు ప్రాధాన్యం

తేమ సంరక్షణ, సూక్ష్మ నీటిపారుదలపై దృష్టి

జేటీఎస్‌ఏయూ శాస్త్రవేత్త డాక్టర్‌ కల్యాణి సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement