మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జాతీయ సెమినార్‌ను విజయవంతం చేసేందుకు సిబ్బంది పూర్తిస్థాయిలో కృషి చేయాలని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పీయూలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, పలు యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్ కూడా పాల్గొనున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం జరిగేందుకు సహకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, కంట్రోలర్ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల నాయకుల దీక్ష విరమణ
పీయూలో నిరసన దీక్షకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులకు దీక్ష విరమింప జేసి, వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు రోజుల పాటు నిర్వహించే సెమినార్‌ను మొదటిరోజు కన్హాశాంతివనంలో, రెండో రోజు పీయూలో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ప్రధాన కారణం ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు, పలు యూనివర్సిటీ వీసీలు, అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్, అధికారులు వస్తున్న క్రమంలో వారికి వసతి, ఇతర సదుపాయాలకు ఇబ్బందులు లేకుండా ఉండడమే అన్నారు. విద్యార్థుల కోరిక మేరకు ఒకరోజు శాంతివనంలో, రెండోరోజు పీయూలో నిర్వహిస్తామని యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
సెమినార్ పీయూలోనే నిర్వహించాలి
పీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8వ తేదీల్లో కన్హాశాంతి వనంలో నిర్వహించే నేషనల్ సెమినార్‌ను పీయూలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ భవనంలో ఏర్పాటు రౌండ్‌టేబుల్ సమావేశంలో పాలమూరు పునః నిర్మాణం ఫోరం అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి అననారు. పీయూ వీసీ తీసుకున్న చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ముఖ్యమంత్రిని ఏకగ్రీవంగా కోరుతున్నామన్నారు. ఎలాగైనా సమావేశాన్ని పీయూలోనే నిర్వహించాలని కోరారు. పాలమూరు పరువు పోతుంటే చూస్తూ ఊరుకోలేమని, విద్యార్థుల కోసం ఎంతటి పోరాటం అయిన చేస్తామన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, అడ్వకేట్ వీరబ్రహ్మచారి, జేపీఎన్‌సీ చైర్మన్ రవికుమార్, చెన్నకిష్టప్ప, ఫారుక్ హుస్సేన్, కిష్టారెడ్డి, శ్రీనివాసులు, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


