కల్వకుర్తి రూరల్: విశ్వశాంతి మహాయాగం పట్టణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మంగళవారం సామూహిక కుంకుమార్చనలు, హోమాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కృష్ణజ్యోతి స్వరూపానందస్వామి భక్తులకు ప్రవచనాలు వినిపించారు. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా దేవుడిపై నమ్మకం పెట్టి చేసే ప్రతి కార్యక్రమం ముందుకు సాగుతుందన్నారు. సర్వేజనా సుఖినోభవంతు అంటూ కోరుకునేది ఒక సనాతన ధర్మంలోనే ఉంటుందన్నారు. తమ ధర్మాన్ని ఆచరించడంతోపాటు సమాజంలోని ఇతరులకు తన వంతు సహాయం చేయడం ముఖ్యమన్నారు. ఉదయం మన్యుసూక్త హోమం, కుజదోష నివారణ హోమాలు, సుబ్రహ్మణ్యస్వామికి అభిషేక అర్చన హోమాలు, సరస్వతి పూజలు హోమాలు జరిపించారు. రాత్రి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాయాగంలో ఆర్డీఓ జనార్ధన్‌రెడ్డి యాగశాల ప్రదక్షిణ చేసి మహాశివుడికి అభిషేకం నిర్వహించి స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ జిల్లెల్ల వెంకటరెడ్డి, జూలూరు రమేష్‌బాబు, పసుల రమాకాంత్‌రెడ్డి, బీచని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


