కల్వకుర్తి టౌన్: ఎన్నికల సంఘం చేపడుతున్న ఓట రు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఓటర్లందరూ వారికి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను చాలావరకు బీఎల్‌ఓల కు తిరిగి అందించారు. ఈ నేపథ్యంలో చాలామంది ఓటర్లు తమ వివరాలను బీఎల్‌ఓలు నమోదు చేశారా.. లేదా? అనే సందేహంలో ఉన్నారు. ఆ సందేహానికి సులభమైన పరిష్కారాన్ని ఎన్నికల సంఘం చూపింది. మొబైల్ ఫోన్‌తోనే ఓటరు వివరాలు సర్‌లో నమోదయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా ఈ సేవను సాధారణ ఫోన్‌తో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకు మొబైల్ ఫోన్‌లో మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి.. ఉఇఐ (స్పేస్) ఓటరు కార్డు నంబరు (EPIC NU MBEQ) టైప్ చేసి 1950 నంబర్‌కు పంపాలి. మెసేజ్ పంపిన కొద్దిసేపటికే ఎన్నికల కమిషన్ నుంచి ఓటరు వివరాలతో ఎస్‌ఎంఎస్ వస్తుంది. వివరాలు వస్తే.. ఓటరు పేరు సర్ ప్రక్రియలో నమోదు అయినట్లు. రాకపోతే ప్రాసెస్‌లో జాప్యం ఉండటం, సరిగ్గా నమోదు కాలేదని తెలుసుకోవాలి. ఉఇఐ, ఓటర్ కార్డు నంబర్ల మధ్య తప్పనిసరిగా స్పేస్ ఉండాలి. ఒకవేళ ఎస్‌ఎంఎస్ రాకపోతే నెట్‌వర్క్‌లో ఆలస్యం, నమోదు ప్రక్రియ పెండింగ్‌లో ఉండవచ్చు. ఈ క్రమంలో బూత్ లెవెల్ అధికారిని సంప్రదించాలి. ప్రతి ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


