పాలమూరులో పని చేయడం గొప్ప గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పాలమూరులో పని చేయడం గొప్ప గుర్తింపు

Jul 24 2026 1:27 AM | Updated on Jul 24 2026 1:27 AM

పాలమూరు:మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టు రెండో అదనపు న్యాయమూర్తిగా పని చేసి అసిఫాబాద్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న శారదాదేవిని గురు వారం కోర్టులో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత ఏర్పాటు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధా న న్యాయమూర్తి ఎన్‌.ప్రేమలత మాట్లాడుతూ పాలమూరులో పని చేయడం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని, ఇక్కడి న్యాయవాదుల ఇతర సిబ్బంది నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. అనంతరం జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆనంద్‌రావు మాట్లాడుతూ జిల్లాలో గత కొన్ని రోజులుగా పని చేసిన రెండో అదనపు న్యాయమూర్తి శారదా దేవి సేవలు మరువలేనివని, ఆమె భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు అనంతరెడ్డి, ఎన్‌పీ వెంకటేష్‌, వినోద్‌కుమార్‌, ప్రతాప్‌కుమార్‌, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, ఇతర న్యాయవాదులు చంద్రమౌళి, సుదర్శన్‌రెడ్డి, రోహిణి అయ్యంగార్‌, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement