లక్ష్మీపల్లి స్కూల్ హెచ్‌ఎం రెండేళ్లుగా సరిగ్గా పనిచేయ డం లేదు. ఆయనపై అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేవరకద్ర ఎమ్మెల్యే సైతం ఆయన్ను బదిలీ చేయాలని సూచించినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అధికారుల తీరుతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది.
– ఆంజనేయులు, లక్ష్మీపల్లి,
దేవరకద్ర మండలం
లక్ష్మీపల్లి హైస్కూల్ హెచ్‌ఎంపై ఫిర్యాదులు వస్తే విచారణ చేయాలని ఆదేశించాం. ఎందుకు విచారణ చేయలేదో తెలియదు. హెచ్‌ఎంగా వేరే వ్యక్తిని నియమించాలనుకున్నాం ఆయనపై చార్జెస్ ఫ్రేం అయిన నేపథ్యంలో పాత హెచ్‌ఎంకే విధులు నిర్వహించాలని సూచించాం. తప్పకుండా విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
– విజయకుమారి, డీఈఓ , మహబూబ్‌నగర్
●


