మహబూబ్‌నగర్ క్రీడలు: నగరంలోని మెయిన్ స్టేడియం ఉమ్మడి జిల్లాలోనే క్రీడలకు కేరాఫ్‌గా మారుతోంది. మొదటి నుంచి ఈ స్టేడియానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా టోర్నమెంట్ల నిర్వహణకు వేదికై ంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న మైదానంలో క్రమంగా క్రీడాకారుల కోసం ఎన్నో వసతులు అందుబాటులోకి వస్తున్నాయి.ఇ ప్పటికే స్టేడియంలో అన్ని వసతులతో కూడిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉండగా.. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులు శిక్షణ తీసుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్, కబడ్డీ టోర్నమెంట్లతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. అలాగే మెయిన్ స్టేడియం ఆవరణలోనే రెండు క్రీడా అకాడమీలు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల క్రితం స్టేడియంలో బాలబాలికల వాలీబాల్ అకాడమీ ఏర్పటైంది. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ, రాష్ట్రస్థాయి టోర్నీల్లో సత్తాచాటారు. ఇటీవలే బాలుర కబడ్డీ అకాడమీ మంజూరైంది. త్వరలో కబడ్డీ అకాడమీలో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రస్థాయి ఎంపికలు జరగనున్నాయి. ఎంపికల్లో ప్రతిభ కనబరిచే 20 మంది బాలురు ఇక్కడ శిక్షణ ఇస్తారు.
రూ.10.70 కోట్లతో సింథటిక్ ట్రాక్..
మెయిన్ స్టేడియంలో ఎప్పుడుప్పుడా అని జిల్లా అథ్లెట్లు ఎదురుచూస్తున్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణాన్ని రూ.10.70 కోట్లతో అధునాతన హంగులతో ఏర్పాటు చేయనున్నారు. 400 మీటర్లు మేర 8 లైన్ల సింథటిక్ ట్రాక్ నిర్మించనున్నారు. ఈ ట్రాక్ పనులకు గత నెల 22న రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తయితే జిల్లాకు చెందిన అథ్లెట్లు నిత్యం ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
ఇటీవల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్
ఏర్పాటుకు శంకుస్థాపన
వాలీబాల్, కబడ్డీ అకాడమీలతో పాటు అధునాతన ఇండోర్ స్టేడియం
భవిష్యత్‌లో మరిన్ని వసతులు


