స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోటి పీఠం పాలమూరుశాఖ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 34వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం శివాలయంలో సుప్రభాతసేవ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సుప్రభాత సేవ, అర్చనలు, వేదపారాయణం, సుబ్రహ్మణ్య నవగ్రహ మూలమంత్ర అనుష్టానాలు నిర్వహించారు. సాయంత్రం తిరుపతికి చెందిన కళాకారులచే భరతనృత్యం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సింహవాహనంపై స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షుడు తోటపల్లి శ్రీకాంత్‌శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
17న టీసీఏ
జిల్లా జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం శ్రీనివాసకాలనీలోని జీకే అనిల్ క్రికెట్ అకాడమీలో ఈనెల 17వ తేదీన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి జీకే ప్రేమ్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–16 బాలుర, అండర్–19 బాల, బాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సంబంధిత జిల్లాకు చెందిన అర్హత ఉన్న ఆయా విభాగాల క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనాలని కోరారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయని, మిగతా వివరాల కోసం భాను, సాత్విక్ (96400 54446, 83092 19707) నంబర్లను సంప్రదించాలని కోరారు.
కత్తులతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. వృద్ధురాలి మృతి
వరుణుడు కరుణించాలని జల దిగ్బంధం
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
– వివరాలు 8లో..


