జడ్చర్ల: జడ్చర్లలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా చేసిన ఏర్పాట్లకు గాలిదుమారం ఆటంకం కలిగించింది. ఆకస్మికంగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గాలి దుమారం హోరెత్తింది. దీంతో బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చిరిగి గాల్లో ఎగిరిపోయాయి. కటౌట్ల కర్రలు విరిగి ఒరిగిపోయాయి. మరికొన్ని కటౌట్లు కింద పడ్డాయి. బహిరంగ సభకు తరలివచ్చే వారికి ఏర్పాటు చేసిన కుర్చీలు కిందికి ఒరిగి పోయాయి. భారీ ఫ్లెక్సీలు సైతం ఎక్కడికక్కడ చిరిగి నేలపై పడ్డాయి. ప్రధాన రహదారులపై సైతం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ చిరిగిపోయి గాల్లో తేలాయి. రహదారులకు అడ్డంగా పడ్డాయి. గాలి దుమారంతోపాటు వర్షం కురువడంతో నేలంతా చిత్తడిగా మారింది. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద భారీగా వర్షం కురువడంతో అక్కడ ఏర్పాట్లకు అంతరాయం కలిగింది. హెలీప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు గాలికి ఎగిరి కిందపడ్డాయి. అయితే అరగంట తర్వాత ఒక్కసారిగా వాతావరణం ప్రశాంతం కావడంతో అధికారులు, నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి బహిరంగ సభ ప్రాంగణంలో గాలి దుమారం కారణంగా జరిగిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లను చక్కదిద్దాలని సంబంధిత అధికారులకు పార్టీ క్యాడర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
చిరిగి గాల్లోకి ఎగిరిన ఫ్లెక్సీలు
విరిగి ఒరిగిన కటౌట్లు
వర్షంతో చిత్తడిగా మారిన నేల
సభా ప్రాంగణంలో గాలి బీభత్సం


