కారు ఢీ.. ద్విచక్రవాహనదారుడి మృతి
గోపాల్‌పేట: భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మరణించాడు. గోపాల్‌పేట ఎస్‌ఐ జగన్‌మోహన్ తెలిపిన వివరాల మేరకు.. ఏదుల మండలంలోని చీర్కపల్లికి చెందిన పోతుల కేశవులు (46) వనజ భార్యాభర్తలు. వీరు మహబూబ్‌నగర్‌లో ఉంటున్న వారి మనుమరాలి బర్త్‌డే శుభకార్యంలో పాల్గొనేందుకు బైక్‌పై చీర్కపల్లి నుంచి బయలుదేరారు. గోపాల్‌పేట, పొలికెపాడు అడ్డరోడ్డు దాటిన తర్వాత బుద్దారం మిట్ట ఎక్కుతుండగా ఎదు రుగా వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కేశవులు తలపగిలి, కాలు విరిగింది. స్థానికులు గమనించి 108లో వనప ర్తి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కేశవులు మరణించాడు. కేశవులు కూతురు స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలోరేషన్ డీలర్ దుర్మరణం
మహమ్మదాబాద్: మండలంలోని వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన రేషన్ డీలర్ వెంకట్‌రెడ్డి(50) తాండూర్ ప్రధాన రహదారిపై ప్రమాదానికి గురై మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి 30 ఏళ్లుగా రేషన్‌డీలర్‌గా పనిచేస్తున్నాడు. సొంత పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి బైక్‌పై వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గ్రామానికి సమీపంలోని వెంకట్‌రెడ్డిపల్లి గేట్ వద్ద బైక్‌ను పార్కు చేశాడు. ఇంతలో వెనకాల నుంచి అతివేగంగా వస్తున్న కారు వెంకట్‌రెడ్డిని బలంగా ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నీటిగుంతలో పడి వృద్ధుడి మృతి
జడ్చర్ల: నీటి గుంతలో ప్రమాదవశాత్తు జారిపడి వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. వల్లూరుకు చెందిన పర్వతాపురం ఆంజనేయులు(56) నీటిగుంత సమీపంలోకి వెళ్లగా.. జారి పడి గల్లంతయ్యాడు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు నీటి గుంతలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. బాదేపల్లి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య రాములమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
చిన్నచింతకుంట: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన చిన్నచింతకుంట మండలం పల్లమరిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పల్లమర్రికి చెందిన గొల్ల శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్ర ఈనెల 18న ద్విచక్రవాహనంపై దేవరకద్రకు వెళ్లారు. పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో లాల్‌కోట గ్రామ బస్టాండ్ వద్ద స్పీడ్ బ్రేకర్ల పై నుంచి బైక్‌ను వేగంగా నడపడంతో వెనకాల కూర్చున్న రాఘవేంద్ర కింద పడిపోయాడు. దీంతో రాఘవేంద్ర తలకు గాయం కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. శుక్రవారం మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
లింగాల: మండలంలోని పద్మన్నపల్లి శివారులో తోకల పెంటయ్య(42) అనే చెంచువ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వంటచెరకు కోసం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొన్నాడు. గమనించిన కొంతమంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆర్థిక సమస్యలతో మద్యం మత్తులో ఉరేసుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. మృతుడికి భార్య నాగమ్మ, కుమార్తె ఉన్నారు. ఘటన గురించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
రైతు ఆత్మహత్యాయత్నం
గండేడ్: పంటకు నీరు పారబెట్టుకుంటున్నాడని గిట్టనివారు ఫిర్యాదు చేయగా.. మోటర్‌ను తొలగించడంతో మనస్తాపానికి గురైన ఓరైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జంగంరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన రైతు కోస్గి లక్ష్మయ్య ఐదెకరాల్లో వరిసాగుచేశాడు. చెరువుకు ఆనుకుని ఉన్న తన సొంత బావిలో మోటరు వేసి నీరు పారబెట్టుకుంటుండగా గిట్టనివారు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం మోటర్ తొలగించారు. మనస్తాపానికి గురైన లక్ష్మయ్య గడ్డిమందు తాగాడు. దీంతో కుటుంబీకులు 108లో ఆస్పత్రికి తరలించారు.
కారు ఢీ.. ద్విచక్రవాహనదారుడి మృతి


