ఇంటర్ యూనివర్సిటీ చెస్ పోటీలకు పయనం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్ యూనివర్సిటీ చెస్ పోటీలకు పీయూ బాలుర జట్టు శుక్రవారం బయలుదేరి వెళ్లింది. తమిళనాడులోని భారతీ దాసన్ యూనివర్సిటీలో వచ్చే నెల 2 నుంచి 6వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో పీయూ జట్టు పాల్గొననుంది. ఈ మేరకు జట్టు సభ్యులకు పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు ట్రాస్‌షూట్‌లు అందజేశారు. యూనివర్సిటీ పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్, ఆనంద్‌బాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


