ఎమ్మెల్యే ఆదేశాలతోనే అక్రమ కేసు
● బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్‌ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు
బల్మూర్: ఉమామహేశ్వర రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా భూనిర్వాసితుల పక్షాన పోరాడుతున్న బీజేపీ ఉప సర్పంచ్ సీతారాంరెడ్డిపై ఎమ్మెల్యే వంశీకృష్ణ అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్, జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు ఆరోపించారు. మండల కేంద్రంలో శుక్రవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారు విలేకర్లతో మాట్లాడారు. గురువారం బల్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఘర్షణపై పక్కనే ఉన్న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన ఉప సర్పంచ్‌పై పోలీసుల సాక్షిగా స్టేషన్‌లోనే కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ బంధువులు దాడి చేస్తున్న వారు ప్రేక్షకపాత్ర వహించడం వారి వైఫల్యానికి నిదర్శనమన్నారు. దాడి జరిగిన ఘటన స్టేషన్ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు అయిందని, దానితో పాటు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజీలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దాడిలో సృహ కోల్పోయిన మాజీ ఎంపీటీసీకి పారదర్శకంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి ఉండగా, ఎమ్మెల్యే హైదరాబాద్‌లోని సొంత ఆస్పత్రిలో ఉంచి తప్పుడు రిపోర్టులతో డ్రామా అడుతున్నారని ఆరోపించారు. దుందుభి వాగును లూటీ చేస్తూ ఎమ్మెల్యే ఇసుక దందాతో రూ.కోట్లు దండుకుంటున్నాడని, త్వరలోనే బండారం బయటపెడుతామన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే తన పదవిని ప్రజల కోసం ఉపయోగించి ప్రజాసామ్యబద్ధంగా నడుచుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి కామారెడ్డి, కుమ్మెర సంఘటనలతో పాటు బల్మూర్ స్టేషన్‌లోనే ఉప సర్పంచ్‌పై జరిగిన దాడే నిదర్శనమని వారు విస్శయం వ్యక్తం చేశారు. అదే విధంగా ఎమ్మెల్యే మెప్పు కోసం తప్పడు పద్ధతిలో పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్‌కు కోర్టుకు లాగుతామని హెచ్చరించారు.
నేడు బంద్‌కు పిలుపు..
బీజేపీ ఉప సర్పంచ్‌పై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపిన సంఘటనకు నిరసనగా శనివారం బీజేపీ ఆధ్వర్యంలో బల్మూర్ మండల బంద్‌కు పిలుపునిచ్చినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తండ్రి సుందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాస్‌రామ్, కార్యదఽర్శులు ఆంజనేయులు, నీలాబాయ్, జానకి, అఖిల్‌రెడ్డి, కాట్రావత్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


