
ఆడిపాడిన కలెక్టర్
పరిపాలనా వ్యవహారాల్లో బిజీగా గడపాల్సిన కలెక్టర్ బదావత్ సంతోష్ మెడికల్ విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. సోమవారం నాగర్‌కర్నూల్ శివారులోని ప్రభుత్వ
మెడికల్ కళాశాలలో నిర్వహించిన ట్రెడిషనల్ డే వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా
హాజరయ్యారు. ఈ సందర్భంగా లంబాడా వేషధారణ విద్యార్థులతో కలిసి కలెక్టర్ నృత్యం చేసి ఉత్తేజపరిచారు. అంతకు ముందు ఆయన
మాట్లాడుతూ భారతీయ కళలు, సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను రాబోయే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, జిల్లా ఆస్పత్రి
సూపరింటెండెంట్ రఘు, డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, వైద్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. – నాగర్‌కర్నూల్ క్రైం