
నూతన విధానం అమలు
గతంలో రైతులు రూ.వేలు పెట్టుబడులు పెట్టి నకిలీ విత్తనాల కారణంగా దిగుబడులు రాక ఆర్థికంగా దెబ్బతిన్నారు. దీంతో ఈ వానాకాలం సీజన్ నుంచి వ్యవసాయశాఖ నూతన విధానాన్ని అమలులోకి తెచ్చింది. విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి విత్తన డీలర్ నుంచి స్టాకులోని ఏదో ఒక విత్తన పాకెట్ సేకరిస్తారు. ఈ విధంగా మార్కెట్‌లో అనుమతి పొందిన కంపెనీలకు చెందిన అన్ని రకాల విత్తనాలను కొద్ది రోజుల క్రితమే సేకరించిన అధికారులు వాటిని రాజేంద్రనగర్‌లోని విత్తన పరిశోధన కేంద్రానికి పంపించారు. అక్కడ మొలక శాతంతోపాటు జన్యు పరీక్షలు నిర్వహించారు. దీంతో కంపెనీలకు అనుమతి ఇవ్వడంతో పత్తి విత్తనాల 35 వేల పాకెట్లు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.