దేశాభివృది్ధలో రాజీవ్‌గాంధీ సేవలు ఎనలేనివి | Sakshi
Sakshi News home page

దేశాభివృది్ధలో రాజీవ్‌గాంధీ సేవలు ఎనలేనివి

Published Wed, May 22 2024 5:30 AM

దేశాభివృది్ధలో రాజీవ్‌గాంధీ సేవలు ఎనలేనివి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: దేశాభివృద్ధి కోసం రాజీవ్‌గాంధీ సేవలు ఎనలేనివని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో మంగళవారం రాజీవ్‌గాంధీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అతిపిన్న వయస్సులోనే రాజీవ్‌గాంధీ అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి చేపట్టి ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఐటీ, కంప్యూటర్‌, టీవీ, సెల్‌ఫోన్లు ఇలా సాంకేతికతను సా మాన్యుడి చెంతకు చేర్చడంలో రాజీవ్‌గాంధీ కృషి చేశారన్నారు. దేశం కోసం రాజీవ్‌గాంధీ తన ప్రాణాలను అర్పించారని కొనియాడారు. దేశంలో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రాజీవ్‌గాంధీ స్ఫూర్తిని కొనసాగిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్‌, అధికార ప్రతినిధి జహీర్‌ అఖ్తర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షబ్బీర్‌, నాయకులు సీజే బెనహర్‌, సురేందర్‌రెడ్డి, సిరాజ్‌ఖాద్రీ, వసంత, బెక్కరి అనిత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement