
విద్యుత్ వైర్లు తగిలి నాలుగు గేదెలు మృతి
జడ్చర్ల టౌన్: నేలకొరిగిన విద్యుత్ వైర్లు తగిలి షాక్‌తో నాలుగు గేదెలు మృతిచెందాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని శిఖర్‌గానిపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. సోమవారం సాయంత్రం, రాత్రి సమయంలో కురిసిన వర్షం, ఈదురుగాలులకు గ్రామ శివారులో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి తీగలు వేలాడుతున్నాయి. ఈ క్రమంలో గ్రామంలోని మండ్ల మధుకు చెందిన నాలుగు గేదెలను కుటుంబ సభ్యులు మంగళవారం మేతకు వదిలారు. మేసుకుంటూ వెళ్లిన గేదెలు పొలంలో తెగిన పడిన విద్యుత్ వైర్లకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాయి. మృతిచెందిన గేదెల విలువ రూ.3.60 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. వ్యవసాయంతోపాటు పాడి ద్వారా జీవనం సాగిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సంఘటన స్థలాన్ని పశువైద్యాధికారి సందర్శించి పంచనామా నిర్వహించారు. అయితే విద్యుత్ స్తంభం బాగోలేదని.. ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా లైన్‌మెన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత రైతు ఆరోపించారు. ఈ విషయమై జడ్చర్ల సబ్‌డివిజన్ ఏడీఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా విచారిస్తామని బదులిచ్చారు.
ఈదురు గాలులు, వర్షానికి నేలకొరిగిన స్తంభం మహబూబ్‌నగర్ జిల్లా శిఖర్‌గానిపల్లిలో ఘటన
అచ్చంపేట శివారులో..
అచ్చంపేట రూరల్: పట్టణంలోని చౌటపల్లి రోడ్డులో విద్యుత్ స్తంభానికి తాకి ఓ గేదె మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గోకుల్‌నగర్‌కు చెందిన అంజనమ్మ గేదెలను వ్యవసాయ పొలానికి తీసుకెళ్తుండగా.. కంచెలేని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఓ గేదె తాకడంతో షాక్‌కు గురై మృతిచెందింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.