లీగ్‌లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి : మైనార్టీశాఖ మంత్రి
పోటీతత్వం పెరగాలి: రాష్ట్ర కార్మికశాఖ వివేక్ వెంకటస్వామి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రంలో క్రీడా వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో సోమవారం కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీహరితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్‌స్వామి, అజహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడామంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనా విధానం మేరకు ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి, ఈ సారి క్రీడలకు రూ.800 కోట్లు, వచ్చే ఏడాది క్రీడలకు దాదాపు రూ.1500 కోట్లు వెచ్చిస్తామని అన్నారు. 2034 జరిగే ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి బంగారు పతకం రావాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హెచ్‌సీఏ మాతో సంప్రదిస్తే ఫిబ్రవరిలో బీసీసీఐ మ్యాచ్ జరిగే ముందే ఈ మైదానంలో కావాల్సిన వసతులు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు.
తెలంగాణ ప్రాతినిధ్యం ఉండాలి..
క్రికెట్ పరంగా భారతదేశంలో తెలంగాణ ప్రాతినిఽ ద్యం ఉండాలని రాష్ట బీసీ వెల్ఫేర్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా 33 జిల్లాల్లో కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. వెంకటస్వామి పేదరిక నిర్మూలన, కార్మికుల సంక్షేమం కోసం కృషి చే శారని కొనియాడారు.క్రీడల్లో ప్రావీణ్యతకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. అంతర్గత రాజకీయాలు వీడి నూతన క్రీడాకారులను తయారుచేసేలా పాటుపడాలని క్రికెట్ అసోసియేషన్‌ను కోరారు.
ఈ లీగ్‌లో క్రికెటర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించా లని రాష్ట్ర మైనార్టీశాఖ మంత్రి, మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. ఇంత పెద్ద ఎత్తున లీగ్ నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జి తేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోనే మహ బూబ్‌నగర్‌లో అన్ని విధాలుగా క్రికెట్ మైదానాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మైదానంలో ఇంకా అనేక అభివృద్ధి పనుల కోసం నిధుల ఇవ్వడంతోపాటు ఫ్లడ్‌ౖలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ఈ టోర్నమెంట్ గొప్ప అవకాశమని అన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. ఇక్కడి క్రికెట్ మైదానం లార్డ్స్ మైదానాన్ని తలపిస్తుందన్నారు. ఇంత మంచి మైదానాన్ని తీర్చిదిద్దిన జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ను అభినందనలు తెలిపారు. అంతకుముందు మంత్రులు టోర్నీ ప్రారంభోత్సవ జెండాను ఆవిష్కరించారు. మైదానంలో బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్‌యాదవ్, కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మన్నె జీవన్‌రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, మిథున్‌రెడ్డి, బెక్కరి అనిత, హెచ్‌సీఏ ప్రతినిధులు దల్జిత్‌సింగ్, బస్వరాజ్, సునీల్ అగర్వాల్, ఎండీసీఏ ప్యాట్రన్ మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, వెంకటరామారావు, సభ్యులు క్రిష్ణమూర్తి, శివశంకర్, నరేందర్‌రెడ్డి, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేలా మా తండ్రి స్మారకంగా తెలంగాణలో టీ–20 లీగ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రతి ఒక్కరూ లీగ్‌లో పోటీతత్వంతో క్రికెట్ ఆడాలని కోరా రు. ఈ లీగ్‌కు సంబంధించి అన్ని జిల్లాల్లో చాలా చక్కగా జట్ల ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ లీగ్‌లో తెలంగాణ వ్యాప్తంగా 104 మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు. గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడూ ఈ మైదానం ఎర్ర మట్టితో ఉండేదని, ఇప్పుడు చక్కటి గ్రీనరీ స్టేడియం కావడం సంతోషంగా ఉందన్నారు.


