యంగంపల్లిలో ఉద్రిక్తత.. ఇరువర్గాల ఘర్షణ
రాస్తారోకోలో జైపాల్‌యాదవ్, తదితరులు
కల్వకుర్తి రూరల్: మండలంలోని యంగంపల్లి గ్రా మంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న వివా దం ఘర్షణగా మారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. పూర్తి వివరాలు.. ఈ నెల 11న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారుడు బొల్గం యాదగిరిరెడ్డి విజయం సాధించారు. విజయం అనంతరం అదే రోజు ర్యాలీ చేయొద్దన్న పోలీసులు ఇచ్చిన సూచన మేరకు ర్యాలీని వాయిదా వేసుకున్నారు. ఆదివారం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా అనంతరం బీఆర్‌ఎస్ కార్యకర్త ఇంటిపై కాంగ్రెస్ మద్దతు దారులు దాడి చేయగా బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రతిఘటించి పరస్పరం దాడి చేసు కున్నారు. ఇది ఇలా ఉండగా సోమవారం ప్రమాణ స్వీకారానికి వచ్చే గ్రామస్తులకు భోజనం ఏర్పాట్లు చేశారు. కూరగాయలను కొనుగోలు చేసేందుకు సర్పంచ్ బంధువులు కల్వకుర్తి కూరగాయల మార్కెట్‌కు వచ్చిన సందర్భంగా వారిపై కాంగ్రెస్ మద్దతుదారులు మరోసారి దాడికి దిగారు. దాడిపై పోలీసులకు బీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని మధ్యాహ్నం గ్రామంలో సర్పంచ్ యాదగిరిరెడ్డితో కలిసి పెద్దఎత్తున రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడమ సత్యం, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌గౌడ్ తదితరులు రాస్తారోకోలో పాల్గొన్నా రు. దాడిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ దాడులను మరోసారి చేస్తే సహించే ప్రసక్తే లేదని సర్పంచ్, పాలకవర్గానికి అండగా ఉంటామన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగడం వారి నైజాన్ని బయటపెట్టిందని ఆరోపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గస్తీ పెంచారు.


