నాగర్‌కర్నూల్ శుభారంభం
లీగ్‌లో తొలి మ్యాచ్‌లో నాగర్‌కర్నూల్ జట్టు 9 వికెట్ల తేడాతో మహబూబ్‌నగర్ జట్టుపై విజయం సాధించి.. శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ 18 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. జట్టులో కేతన్‌కుమార్ (23) ఒక్కడే రాణించాడు. నాగర్‌కర్నూల్ బౌలర్లు జశ్వంత్ 3, గగన్ 2 వికెట్లు తీశారు. వెలుతురు సరిగా లేని కారణంగా 15 ఓవర్లలో 64 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నాగర్‌కర్నూల్ 9 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఆ జట్టులో పి.సుబ్రత్ కౌషిక్ 39, సాయి వంశీవర్మ 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన జశ్వంత్ (నాగర్‌కర్నూల్)కు రూ.2 వేలు, మెమోంటో అందజేశారు. లీగ్‌లో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటలకు గద్వాల–నారాయణపేట, మధ్యాహ్నం ఒంటి గంటకు వనపర్తి–మహబూబ్‌నగర్ జట్లు తలపడుతాయి.


