విరిసిన విజ్ఞానం... మెరిసిన ప్రయోగం
● ఉత్సాహంగా జిల్లాస్థాయి
వైజ్ఞానిక ప్రదర్శన
● నూతన ఆవిష్కరణలతో
సత్తా చాటిన విద్యార్థులు
గద్వాలటౌన్: తరగతి గదిలో ఉపాధ్యాయులు కలిగించిన ప్రేరణ.. చుట్టూ ఉన్న సమాజంలో కనిపించిన సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలకు తెర తీస్తున్నారు విద్యార్థులు. విజ్ఞానం, వికాసం కోసమే కాదు.. జనహి తం కోసం అన్న మహనీయుల స్ఫూర్తి పథాన్ని అణువణువునా నింపుకొని అద్భుతాలు సృష్టిస్తున్నా రు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని శ్రీనివాస రామానుజన్ ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభతో పోటీ పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వీక్షకులతో ప్రాంగణం కోలాహలంగా మారింది.


