సిట్టింగ్‌ అభ్యర్థికి షాకిచ్చిన గులాబీబాస్‌..! | - | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌ అభ్యర్థికి షాకిచ్చిన గులాబీబాస్‌..!

Nov 8 2023 1:42 AM | Updated on Nov 8 2023 12:10 PM

- - Sakshi

అలంపూర్‌: బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ అభ్యర్థికి గులాబీబాస్‌ షాకిచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆగస్టు 21న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా ప్రకటించారు. అందులో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహంను అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.. తన అనుచరుడికి టికెట్‌ ఇవ్వాలని పట్టుబట్టారు.

మారిన రాజకీయ పరిణామాలతో అబ్రహంకు బీఫాం ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడంతో అనిశ్చితికి దారితీసింది. ఎట్టకేలకు ఎమ్మెల్సీ తన పంతాన్ని నెగ్గించుకోవడంతో 20 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యే అబ్రహంను కాదని ఎమ్మెల్సీ అనుచరుడు విజయుడికి బీఫాం దక్కింది. మంగళవారం హైదరాబాద్‌లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేతుల మీదుగా విజయుడు బీఫాం అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement