చదువు ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

చదువు ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Jul 10 2026 7:28 AM | Updated on Jul 10 2026 7:28 AM

భూత్పూర్‌: చదువుకునేందుకు ఇష్టం లేక బలవంతంగా పాఠశాలలో చేర్పించారని క్షణికావేశంలో పెట్రోల్‌ పోసుకొని 5వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంలోని కర్వెన గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. బంధువుల కథనం మేరకు.. మండలంలోని చౌలతండాకు చెందిన శాంతి, హన్మంత్‌నాయక్‌ హైదరాబాద్‌లో అడ్డకూలీగా పనులు చేస్తున్నారు. వీరికి ఆకాశ్‌ అనే కుమారుడు ఉన్నా డు. బుధవారం ఆకాశ్‌ను గ్రామంలోని మథర్‌ థెరి స్సా ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతిలో చేర్పించడంతో పాటు హాస్టల్‌లో చేర్చేందుకు యాజమాన్యంతో మాట్లాడి సాయంత్రం హైదరాబాద్‌ తిరిగి వెళ్లారు. ఈ క్రమంలో గురువారం ఆకాశ్‌ పాఠశాల నుంచి ఇంటర్‌వెల్‌ సమయంలో ఉపాధ్యాయులకు చెప్పకుండా బయటకు వెళ్లి ఓ కిరాణం దుకాణంలో పెట్రోల్‌ తీసుకొని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. కేకలు వేయడంతో గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. ఆకాశ్‌కు రెండు చేతులు 8 శాతం మేర కాలా యని ప్రథమ చికిత్స అనంతరం 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం తెలియడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

అనుమతి

లేకుండానే హాస్టల్‌ నిర్వహణ

కర్వెన మథర్‌ థెరిస్సా ప్రాథమికోన్నత పాఠశాల హాస్టల్‌కు అనుమతి లేదని, అనుమతి తీసుకో వాలని పాఠశాల యజమాన్యాన్ని ఆదేశించిన అనుమతి తీసుకోలేదని ఎంఈఓ ఉషారాణి తెలిపారు. విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించామన్నారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్‌ చందును వివరణ కోరగా గురువారం ఆకాశ్‌ను డేస్కాలర్‌గా పాఠశాలకు పంపించి వెళ్లారని తెలిపారు. ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement