పనుల నాణ్యతలో రాజీ లేదు: యెన్నం | - | Sakshi
Sakshi News home page

పనుల నాణ్యతలో రాజీ లేదు: యెన్నం

Jul 10 2026 7:28 AM | Updated on Jul 10 2026 7:28 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: నగరం అభివృద్ధిలో భాగంగా అమృత్‌–2 కింద అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ (యూజీడీ), ఎస్‌టీపీ (సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌)లు, తాగునీటి వ్యవస్థ పటిష్టానికి చేపడుతున్న పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ లేదని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో పబ్లిక్‌ హెల్త్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా యూడీజీ రూట్‌మ్యాప్‌, కార్పొరేషన్‌ పరిధి డిజైన్‌ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు. నగరంలో తాగునీటి, మురుగు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామన్నా రు. మూడు ఎస్‌టీపీలు ఏర్పాటు చేసి ఇళ్లు, పరిశ్రమల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధిచేసి పర్యావరణానికి హాని కలగకుండా పునర్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. అలాగే కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాలతో పాటు కొత్తగా ఏర్పడిన కాలనీలను సమగ్రంగా సర్వే చేయాలన్నారు.మేయర్‌ జి.మమత, డిప్యూటీ మేయర్‌ ఎం.సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ పి.రామాంజులరెడ్డి, పాల్గొన్నారు.

ఆర్‌ఎన్‌ఆర్‌ @ రూ.2,730

జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌యార్డులో గురువారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ రకానికి సంబంధించి క్వింటా గరిష్టంగా రూ.2,730, కనిష్టంగా రూ.2,505 ధరలు లభించాయి. అదేవిదంగా మొక్కజొన్న గరిష్టంగా రూ.2,406, కనిష్టంగా రూ.1,900, మినుములు రూ.6,600 ధరలు కేటాయించారు. గద్వాల మార్కెట్‌కు గురువారం 1,220 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. క్వింటా గరిష్టం రూ.7,599, కనిష్టంగా రూ.4,071, సరాసరిగా రూ.6,800 ధరలు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement