ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

Jul 10 2026 7:28 AM | Updated on Jul 10 2026 7:28 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఏబీవీపీ ఆద్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని గురువా రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి శివకుమార్‌జీ హాజరై ప్రసంగించారు. విద్యార్థి సంక్షేమం, జాతీయ చైతన్యం, దేశ నిర్మాణం కోసం ఏబీవీపీ ఏర్పడిందని, 78ఏళ్లు విద్యారంగం సమస్యల కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకేపరిపాలన వ్యవస్థ ఉండాలని ఎన్నో ఉద్యమాలు చేసిందని, జాతీయ సమైక్యత కోసం విద్యార్థి సమాజాన్ని చైతన్యవంతం చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు అనంతరెడ్డి, విభాగ సంఘటన కన్వీనర్‌ నవేంద్రజీ, లక్ష్మణ్‌, సాతర్ల అర్జున్‌, నాగుణుల వేణు, సౌమ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement