అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
మహబూబాబాద్: సైన్స్‌ఫెయిర్ లాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం జిల్లాస్థాయి చెక్‌ముకి సైన్స్ సంబురాల పోస్టర్లను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 12న నిర్వహించే సంబురాలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీజీ శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మార్చిలోగా అమృత్ పనులు పూర్తి
డోర్నకల్: వచ్చే సంవత్సరం మార్చిలోగా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అమృత్ జల్ పనులు పూర్తి చేయాలని సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. డోర్నకల్‌లో జరుగుతున్న అమృత్ జల్ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. మూడు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ ట్యా ంకులతో పాటు పైపుల పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అమృత్ పనుల్లో రెండు ట్యాంకుల నిర్మాణం పూర్తయిందని, మరో ట్యాంకు నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలిపారు. వచ్చే మార్చి లోగా పనులు పూర్తవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఏఈ శృతి, చైర్‌పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్, వైస్‌చైర్‌పర్సన్ మాదా లావణ్యాశ్రీనివాస్ పాల్గొన్నారు.
సర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి
మహబూబాబాద్: సర్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అఽధికారి సుదర్శన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సర్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. జాబితాలోని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణంగా పరిశీలించాలన్నారు. ఈనెల 30న తుది ఓటరు జాబితా ప్రచురించాలన్నారు. వీసీలో కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి
దంతాలపల్లి: తనిఖీ కేంద్రాల్లో ప్రతీ వాహ నాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆర్‌డీడీ పద్మావతి అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ తనిఖీ కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వాహనాల రాకపోకలపై సిబ్బంది పనితీరును పరిశీలించారు. మార్కెట్‌కు సంబంధించిన లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలన్నారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో విక్రయ విలువలను ప్రామాణికంగా తీసుకొని రుసుము వసూలు చేయాలని స్పష్టం చేశారు. తనిఖీ కేంద్రం సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
సెమిస్టర్ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలో బీఏ, బీకాం, బీఎస్సీ మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలను కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి పరిశీలించారు. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఈనెల 23 వరకు పరీక్షలు కొనసాగుతాయని ప్రిన్సిపాల్ తెలిపారు. అధ్యాపకులు డాక్టర్ అంజన్‌రావు, డాక్టర్ జితేందర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.


