డ్రగ్స్‌ రహిత సమాజమే ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజమే ముఖ్యం

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని ఎస్పీ శబరీష్‌ అన్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, యువతతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి న్యూఢిల్లీ వరకు సుమారు 3 వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేపట్టిన ఇందుకూరి విజయలక్ష్మి సోమవారం జిల్లా మీదుగా వెళ్లారు. ఈ క్రమంలో ఎస్పీ శబరీష్‌ను ఆమె జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయలక్ష్మి చేపట్టిన సాహసోపేతమైన అవగాహన యాత్రను ఎస్పీ అభినందించారు. 62 ఏళ్ల వయసు లోనూ సమాజ శ్రేయస్సు కోసం ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులు, యువతకు వివరించి, వారిని మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రతీ పౌరుడి సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. విజయలక్ష్మి చేపట్టిన ఈ అవగాహన యాత్ర మరింత మందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, టౌన్‌ సీఐ రఘుపతిరెడ్డ్డి, ఎస్సైలు అరుణ్‌ కుమార్‌, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

కళాశాలల్లో..

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్‌ కళాశాలలను విజయలక్ష్మి సోమవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు అరుణ్‌కుమార్‌, సూరయ్య, డీఐఈఓ మదార్‌గౌడ్‌, నలంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ డోలి సత్యనారాయణ, ప్రిన్సిపాళ్లు గణేష్‌, సదానందం, కృష్ణప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

సైకిల్‌ యాత్ర చేపట్టిన విజయలక్ష్మిని అభినందించిన ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement