కనికరించండి | - | Sakshi
Sakshi News home page

కనికరించండి

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

కలెక్టర్‌ గారూ

పని కావడం లేదు.. రవాణా చార్జీలు వృథా అవుతున్నాయి

సమస్యల పరిష్కారానికి

ప్రాధాన్యం ఇవ్వాలి

● కలెక్టర్‌ స్నేహశబరీష్‌

ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా కలెక్టర్‌ స్నేహశబరీష్‌ స్వయంగా వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వసతి గృహాల నిర్వహణలో క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. విద్యాసంస్థలు, వసతి గృహాల్లో తాగునీరు, విద్యుత్‌, హెల్త్‌ , న్యూట్రిషన్‌, శానిటేషన్‌పై ప్రత్యేక అధికారులు తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజావాణిలో 115 వినతులు వచ్చినట్లు అఽధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

మహబూబాబాద్‌: ప్రజావాణిలో పలుమార్లు వినతులు ఇచ్చినా.. సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో మాట్లాడుకొని వచ్చి వినతులు ఇచ్చినా పనికావడం లేదని, దీంతో ఆటో చార్జీలు వృథా అవుతున్నాయని దివ్యాంగులు వాపోతున్నారు. కలెక్టర్‌కు స్వయంగా వినతులు ఇస్తున్నామని, అయినా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఆరోపింస్తున్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ స్నేహశబరీష్‌, అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ వినతులు స్వీకరించారు. కలెక్టర్‌ ప్రతీ ప్రజావాణిలో వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని, పెండింగ్‌లో ఉన్నవి కూడా పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. అయితే కలెక్టర్‌ చెబుతున్నా.. వినతుల పరిష్కారం కావడం లేదని బాధితులు చెబుతున్నారు.

●

అధికారులు స్పందించడం లేదని దివ్యాంగుల ఆవేదన

ప్రజావాణిలో పాలనాధికారికి మొర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement