గార్ల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య
అర్హత జాబితా..
18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు, స్థానిక మహిళ తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని అర్హత, అనర్హత జాబితాను ప్రాజెక్ట్‌ల వారీగా సిద్ధం చేశారు. దసరా సెలవుల కారణంగా జాబితా ప్రదర్శన చేయలేదని వారు తెలిపారు. చివరికి 101 టీచర్ పోస్టులకు 2,221 మందితో, 131 ఆయా పోస్టులకు 919 మంది అభ్యర్థుల జాబితా తయారు చేశారు. కాగా, టీచర్ పోస్టులకు 1623 మంది వెరిఫికేషన్ చేసుకోగా, 598మంది హాజరు కాలేదు. ఆయా పోస్టులకు747 మంది వెరిఫికేషన్ చేసుకోగా, 172మంది హాజరు కాలేదని అధికారులు తెలిపారు. కొంతమంది రెండు, మూడు కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడం వల్ల వెరిఫికేషన్‌లో తేడా వచ్చినట్లు తెలిపారు.
మహబూబాబాద్: జిల్లాల అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియంలో భాగంగా పత్రాల పరిశీలన, ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. అర్హత జాబితాను సిద్ధం చేశారు. దసరా సెలవుల అనంతరం జాబితా ప్రదర్శన చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపా రు. అభ్యంతరాల స్వీకరించనున్నారు. ఆతర్వాత కలెక్టర్ సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
1,437 కేంద్రాలు..
జిల్లాలో 1,437 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కాగా, 1,309మంది టీచర్లు, 957 మంది ఆయాలు, 49మంది సూపర్ వైజర్లు మాత్రమే పని చేస్తున్నా రు. టీచర్లు లేని సెంటర్లను ఇన్‌చార్జ్‌లతో నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్రాల నిర్వహణ కష్టంగా మారింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 24న 101 టీచర్ పోస్టులు, 130 ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
పదిరోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ
ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. పదిరోజుల గడువు ఇచ్చా రు. 101 టీచర్ పోస్టులకు 2,172 దరఖాస్తులు, 130 ఆయా పోస్టులకు 891 దరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబర్ 7నుంచి 19 తేదీ వరకు ప్రాజెక్ట్‌ల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు.
ప్రదర్శన..
దసరా పండుగ తర్వాత సంబంధిత గ్రామ పంచా యతీ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శించనున్నారు. అభ్యంతరాల కోసం కూడా గడువు ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యంతరాల పరిష్కారం తర్వాత జాబితాను ఆన్లైన్ చేస్తారు.
ఇంటర్వ్యూ ద్వారా..
ఇంటర్వ్యూలో కమిటీ చైర్‌పర్సన్‌గా కలెక్టర్, మెంబర్లుగా డీఎంహెచ్ఓ, ఆర్డీఓ, కన్వీనర్‌గా డీడబ్ల్యూ ఓ వ్యవహరిస్తారు. ఇంటర్ మెరిట్‌కు 70శాతం మార్కులు, వితంతువుకు 5 శాతం, అనాథకు 10శాతం , దివ్యాంగులకు 5శాతం మార్కులు వేస్తారు. ఇంటర్ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అఽధికారులు తెలిపారు.
గైడ్‌లైన్స్ ప్రకారమే..
పోస్టుల భర్తీ అంతా గైడ్ లైన్స్ ప్రకారమే చేస్తున్నాం. ఎలాంటి పొరపాటు లేకుండా పకడ్బందీగా జాబి తాను తయారు చేశారు. జాబితా ప్రదర్శన, అభ్యంతరాలు, పరిష్కారం జరుగుతుంది. అంతా ఆన్లైన్ చేస్తా. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. అర్హత ఉన్న వారికి పోస్టులు వస్తాయి.
దసరా పండుగ తర్వాత అంగన్వాడీ అభ్యర్థుల జాబితా ప్రదర్శన
అభ్యంతరాలు, పరిష్కారాలకు అవకాశం
ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ఆశతో అభ్యర్థుల ఎదురుచూపు


