సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సర్వీస్ రికార్డులను డిజిటల్ సర్వీస్ రిజిస్టర్ (డీఎస్ఆర్)గా మార్చి, సర్వీస్‌కు సంబంధించిన వివిధ అంశాలను ఆన్లైన్ విధానంలోనే నిర్వహించేందుకు ఈహెచ్ఆర్ఎంఎస్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
ఉద్యోగి సర్వీస్ మొత్తం ఒకే చోట..
ఇప్పటివరకు ఉద్యోగుల సర్వీస్ రికార్డులు ప్రధానంగా భౌతిక రూపంలో ఉండడంతో సర్వీస్ వ్యవహారాల పరిష్కారంలో జాప్యం, వివరాల ధ్రువీకరణలో ఇబ్బందులు, పెండింగ్ ఫైళ్లపై కేంద్రీకృత పర్యవేక్షణ లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయ ని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో తెలంగా ణ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐ ఎస్)లో ఈ హెచ్ఆర్ఎంఎస్ను ప్రత్యేక మాడ్యూల్‌గా తీసుకొచ్చింది. కాగా, ఉద్యోగి సర్వీస్‌కు సంబంధించిన సెలవులు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, బదిలీలు, ఏసీఆర్/ ఏపేఏ ఆర్, స్థిరాస్తుల వివరాలు, విజిలెన్స్ అంశాలు, ప దవీ విరమణ కేసులు తదితర వివరాలను దశలవా రీగా ఈ హెచ్ఆర్ఎంఎస్లో నిర్వహించనున్నారు.
పర్యవేక్షించే నోడల్ అధికారులు..
ఉమ్మడి వరంగల్‌లో ఆరుగురికి నోడల్ బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ ఎ.శ్రీనివాస్‌కుమార్ (డీడీ), వరంగల్‌కు జె.విజయసారథి (ఏడీ), జనగామ ఎండీ అన్వర్ హుస్సేన్ (ఏటీఓ), జయశంకర్ భూపాలపల్లి సయ్యద్ ఖలీద్ హుస్సేన్‌ను నియమించారు. మహబూబాబాద్‌కు ఎండీ షరీఫ్బాబా, ములుగుకు సయ్యద్ ఖలీద్ (ఏటీఓ)ను నియమించారు. ఈ అధికారులు ఆయా జిల్లాల్లో డీడీఓలు, ఇతర అధికారులకు ఈహెచ్ఆర్ఎంఎస్ అమలులో సహకరించాల్సి ఉంటుంది.
ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో ఈహెచ్ఆర్ఎంఎస్ అమలు
ఉద్యోగుల సెలవులు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, బదిలీలన్నీ ఆన్లైన్లోనే
పెండింగ్ ఫైళ్లపై ఉన్నతాధికారుల నిఘా.. డిజిటల్ సర్వీస్ రిజిస్టర్‌తో పారదర్శకత


