ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ | - | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ

Oct 19 2026 2:07 AM | Updated on Oct 19 2026 2:07 AM

● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

తొర్రూరు: ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని పెద్ద చెరువు సమీపంలో ఆదివారం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతకుముందు నాంచారిమడూరులో నిర్వహించిన వేడుకల్లోనూ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలకు రూ.10కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ తూనం శ్రావణ్‌కుమార్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ సోమ రజిని, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement