● డీఏఓ ఎస్.విజయచంద్ర
మహబూబాబాద్ రూరల్: వ్యవసాయంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని డీఏఓ ఎస్.విజయచంద్ర అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదిక కార్యాలయంలో గురువారం అంతర్జాతీయ కిసాన్ మహిళా దినోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. వ్యవసాయంలో పంటల సాగు, అధిక దిగుబడులు సాధించడంలో మహిళా రైతుల కృషి ఎంతో ఉంటుందన్నారు. పంటల్లో నాణ్యత పెంచేందుకు వ్యవసాయంలో రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ వ్యవసాయ విధానంపై దృష్టి సాధించాలని, సమీకృత వ్యవసాయ విధానంపై మహిళా రైతులకు అవగాహన కల్పించారు. ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు ప్రకృతి వ్యవసాయంపై ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బ్రహ్మాస్త్రం తయారీలో గోవు మూత్రం, పశువుల పేడ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, టెక్నికల్ ఏఓ రాంజీ, ఏఈఓలు లయ, పున్నమి, సరిత, వినూషా వివిధ మండలాల నుంచి మహిళా రైతులు పాల్గొన్నారు.


