● తిరుపతి నుంచి హనుమకొండకు
వస్తుండగా ఘటన
రాజాపూర్: ఆర్టీసీ బస్సు చక్రాలు వేడిక్కి, మంటలు చెలరేగిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. హనుమకొండ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి గురువారం ఉదయం ఆరున్నర గంట లకు 36 మంది ప్రయాణికులతో హనుమకొండకు బయలుదేరింది. ఈ క్రమంలో రాజాపూర్ మండల కేంద్రానికి చేరుకున్న సమయంలో బస్సులో కాలిన వాసన వస్తుందని గమనించిన ప్రయాణికులు డ్రైవర్ల సమాచారం అందించారు. అంతేకాకుండా బస్సు టైర్ల వద్ద మంటలు వస్తున్న విషయాన్ని గమనించిన రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి డ్రైవర్‌కు చెప్పడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఎస్‌బీఐ వద్ద నిలిపాడు. వెంటనే బ్యాంకులోకి పరుగెత్తి ఫైర్‌ట్యాంక్‌ను తీసుకొచ్చిన డ్రైవర్లు టీజే సింగ్, శంకర్ మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆ పక్కనే భవనం పనులు జరుగుతుండడంతో ప్రయాణికులు బోరు ఆన్ చేసి నీటితో మంటలను ఆర్పారు. దీంతో దైవదర్శనం నుంచి తిరిగి వస్తూ అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


