గీత కార్మికుల ప్రాణ రక్షణకు కిట్లు | - | Sakshi
Sakshi News home page

గీత కార్మికుల ప్రాణ రక్షణకు కిట్లు

Oct 3 2026 1:20 AM | Updated on Oct 3 2026 1:20 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : గీత కార్మికులు ప్రమాదాల బారినపడకుండా కాటమయ్య రక్షణ కవచం కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను మహబూబాబాద్‌ ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా మురళీనాయక్‌ మాట్లాడుతూ.. గౌడన్నలు చెట్లు ఎక్కిన సందర్భంలో ప్రమాదాల బారినపడకుండా ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం కిట్లను అందజేస్తుందన్నారు. గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు నాలుగు విడతలుగా 1,000 కిట్లను పంపిణీ చేశామని అన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ సీఐ రాంప్రసాద్‌, ఎస్సై వసంత, బీసీ సంక్షేమ శాఖ ఏఈఓ బాసునాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాస్‌, నాయకులు నీరుటి లక్ష్మీనారాయణ, ఎండీ.ఖలీల్‌, దూపటి వినయ్‌, ఎడ్ల రమేష్‌, బానోతు భాస్కర్‌, పద్మం ప్రవీణ్‌ కుమార్‌, బద్దెపురి గోపి, చిదిరాల జ్ఞానేశ్వర్‌, నిమ్మల శ్రీనివాస్‌, ఆకుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement