మహబూబాబాద్: మహనీయుల ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడారు. అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
గాంధీజీ ఆశయాలు మార్గదర్శకం
మహబూబాబాద్ రూరల్ : గాంధీజీ ఆశయాలు అందరికీ మార్గదర్శకమని ఎస్పీ శబరీష్ పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గాంధీజీకి నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ


