91 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

91 కిలోల గంజాయి పట్టివేత

Sep 29 2026 1:15 AM | Updated on Sep 29 2026 1:15 AM

ఆత్మకూరు : ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 91కిలోల ఎండు గంజాయిని ఆత్మకూరు పోలీసులు సోమవారం పట్టుకున్నారు. సీఐ బాబులాల్‌ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అల్లూరిసీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం బూసికొండ గ్రామానికి చెందిన వెలుగూరి తాతారావు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.అదనంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అదే జిల్లా చింతూరు మండలం మోతుగూడెనికి చెందిన కిలో గోపాల్‌రావు, కిలో సత్తిబాబుతో కలిసి గంజాయి రవాణా చేసి డబ్బులు సంపాదించాలని భావించాడు. ఈ క్రమంలో వీరంతా ఒడిశా రాష్ట్రం గుంటవాడలో 500 కిలోల గంజాయిని కొనుగోలు చేసి 410 కిలోల గంజాయిని వేరే వాహనంలో పంపించారు. మిగతా 91కిలోల గంజాయిని భద్రాచలం, ఏటూరునాగారం, వరంగల్‌ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే లారీలో తరలిస్తున్నారు. కాగా మండలంలోని గుడెప్పాడ్‌ జంక్షన్‌ వద్ద ఆదివారం రాత్రి ఆత్మకూరు ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా లారీలో నిందితులు గంజాయితో పరారవుతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. విచారణలో గంజాయిని తరలిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని రూ.45.66 లక్షల విలువ చేసే 91 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ బాబులాల్‌ తెలిపారు. సీఐ,ఎస్సైతోపాటు సిబ్బంది అనిల్‌కుమార్‌, కరణ్‌, శ్రీనివాస్‌, ప్రసాద్‌, కరుణాకర్‌ ఉన్నారు.

అంతర్రాష్ట్ర నిందితుల అరెస్టు, రిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement