వీసీలో సీఎస్ సంజయ్ జాజు
మహబూబాబాద్: రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ సంజయ్‌జాజు మాట్లాడుతూ.. కలెక్టర్లు రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలన్నారు. ఆహారం, శానిటేషన్, మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఫుడ్ పాయిజన్, ఎలుకలు, పాముకాటు ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శీతాకాలం దృష్ట్యా వెచ్చని నీరు, దుప్పట్లు ముందుగానే అందుబాటులో ఉంచాలన్నారు. దసరా నాటికి ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫామ్‌లు అందేలా చూడాలన్నారు. డ్యాష్ బోర్డు, ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో వివరాలు ఎప్పటికప్పుడు నవీకరించాలన్నారు. వీసీలో కలెక్టర్ స్నేహశబరీష్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టక్ పురుషోత్తం, సంబంధిత అఽధికారులు పాల్గొన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేతోలు గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రి య కార్యక్రమాన్ని డీఏఓ సోమవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువుల బుకింగ్, పంట కొనుగోలు, పనిముట్లు, విత్తనాలు సబ్సిడీ, పంట రుణాలు పొందాలంటే భూమి కలిగిన ప్రతీ రైతు తప్పనిసరిగా రైతు రిజిస్ట్రీ చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు నమోదు చేయించుకోని రైతులు వెంటనే ఈ నెల 30వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మహబూబాబాద్ మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, మల్యాల క్లస్టర్ ఏఈఓ బిట్ల సరిత, రైతులు పాల్గొన్నారు.
క్రీడలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మహబూబాబాద్ అర్బన్ : కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలతో పాటు క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం ఇన్‌చార్జ్ డీఈఓ మందుల శ్రీరాములు అధ్యక్షతను ఎస్‌జీఎఫ్ జిల్లాస్థాయి క్రీడలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ హాజరై మాట్లాడారు. యువత క్రీడల్లో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. నవంబర్‌లో హైదరాబాద్‌లో ఖేలో ఇండియా యూత్ క్రీడలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబరించి జాతీయస్థాయిలో రాణించాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ రవీందర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి క్రీడలను ప్రారంభించారు. ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వాసిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కౌన్సిలర్ కాట భాస్కర్, డీఎస్పీ తిరుపతిరావు, జిల్లా క్రీడలశాఖ అధికారి ఓలేటి జ్యోతి, పోషకులు జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు పద్మ, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కొమ్ము రాజేందర్, పీఈటీలు శంకర్ నాయక్, చాంప్లనాయక్, నాగిరెడ్డి, వెంకటేశ్వర్లు, కాశీ నాథ్, కమల్‌కిషోర్, భిక్షపతి, నాగేశ్వర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ట్యాబ్‌ల పంపిణీ
మహబూబాబాద్: కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో సోమవారం డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన పలువురు దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు, ట్యాబ్‌లను ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ పంపిణీ చేశారు. ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష, మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ పాల్గొన్నారు.
శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
గూడూరు: మండల కేంద్రంలోని సనాతన శివాల యం గర్భగుడిలో శివలింగాన్ని సోమవారం ఉద యం 6.15నుంచి 6.25గంటల వరకు సూర్యకిరణాలు తాకాయి. ప్రతీ సంవత్సరం ఉత్తరాయణ, దక్షిణాయణ పుణ్యకాలంలో శివలింగాన్ని సూర్యకిరణాలు తప్పకుండా తాకుతాయి.


