ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

● ఎస్పీ శబరీష్‌

కురవి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ శబరీష్‌ ఆదేశించారు. సోమవారం కురవి పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించి తనిఖీ చేశారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. సిబ్బంది యూనిఫామ్‌ పరిశీలించి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ హెల్త్‌ చెకప్‌లు చేయించుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌ ను పరిశీలించి పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవా లన్నారు. సీజ్‌ చేసిన వాహనాలను క్రమపద్ధతిలో భద్రపరచాలని సూచించారు. స్టేషన్‌లోని లాకప్‌, ఈసీఓపీఎస్‌, రైటర్స్‌రూమ్‌, వివిధ విభాగాలను పరిశీలించారు. సీసీటీఎన్‌ఎస్‌, ఈ సమన్స్‌, ఈ– సాక్ష్యా ఆన్‌లైన్‌ ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్స్‌, టీజీ–కాప్‌ తదితర పోలీసింగ్‌ వ్యవస్థల అమలుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రౌటీ షీట్లు, సస్పెక్ట్‌ షీట్లు, గంజాయి నేరస్తులు , సీసీటీవీ సర్వేలైన్స్‌ తదితర అంశాలకు సబంధించిన రికార్డులను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై స్పందనతోపాటు నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుడుంబా, గంజాయిపై ప్రత్యేక నిఘా, డ్రంకెన్‌ డ్రైవ్‌లు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్రమ రవాణాపై నిఘా కొనసాగించాలని తెలిపారు. గంజాయి వినియోగం, విక్రాయలు, రవాణాకు పాల్పడే వారిపై నిఘా పెంచాలన్నారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు గ్రామాలు, విద్యా సంస్థల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగం పెంచాలని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement