మహబూబాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జ్ఞానేశ్‌కుమార్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా డీసీసీ అద్యక్షురాలు మాట్లాడుతూ.. దళితులు, మైనా ర్టీలు, గిరిజనుల ఓట్ల తొలగింపునకు ప్రధాని మో దీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్(సర్) పేరుతో ఓట్లను తొలగించడం సరికాదన్నారు. ప్ర జాస్వామ్యంలో ఓటు బ్రహ్మాస్త్రం లాంటిందన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్నారు. ఓటు హక్కును కాపాడుకోవాలని, అందుకోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మోదీ, అమిత్ షా కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బి. శ్రీనివాస్, యాదవరెడ్డి, చలమల నారాయణ, రామగోని రాజు, నీరుటి లక్ష్మీనారాయణ, ఎడ్ల రమేశ్, గిరిధర్‌గుప్తా, ఖలీల్, తిప్పర్తి శ్రధర్, వెంకట్, రవికుమార్, దిలీప్, రాజు, బాస్కర్, జ్ఞానేశ్వర్, నాళ్ల నర్సింహరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా


