లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి

Sep 28 2026 1:23 AM | Updated on Sep 28 2026 1:23 AM

● టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి

హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిస్వార్థంగా పోరాడిన మహా నీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్ర పటానికి సీఎండీ, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కోసం బాపూజీ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆయన త్యాగం, నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. రాష్ట్ర సాధనకు కృషి చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకనుగుణంగా రాష్ట్ర ప్రగతికి ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. డైరెక్టర్లు వి.మోహన్‌ రావు, సి.ప్రభాకర్‌, చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ బోనాల కిషన్‌, చీఫ్‌ ఇంజనీర్లు వెంకటరమణ, మల్లికార్జున్‌, నాగప్రసాద్‌, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎంలు కళాధర్‌ రెడ్డి, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement